మెగా ఫ�యాన�స� టార�గెట� అదే

<< Back


మెగా ఫ్యాన్స్ కి ఈ మధ్య పండగలు ఎక్కువయిపోయాయి. మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు పెరగడంతో.. ప్రతీ మెగా హీరో మూవీ రిలీజ్ కి పండగ వాతావరణం కనిపిస్తోంది. నెలకు.. రెండు నెలలకు ఓ పండగ వచ్చేస్తోంది. అయితే.. మెగాభిమానులకు అన్నిటి కంటే పెద్ద పండుగ 'మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే'. ఆ పండుగ మరెన్నో రోజులు లేదు. ఆగస్ట్ 22నే చిరు 61వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఆఫ్ లైన్ లో పూజల హంగామా బాగానే నడుస్తోంది. వారం ముందు నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో శాంతి పూజలు గట్రా మొదలెట్టేశారు. ఇక మెగాఫ్యాన్స్ చేసే ఆన్ లైన్ రచ్చ కూడా ప్రారంభమైపోయింది. ఈ రచ్చలో కూడా టార్గెట్స్ సెట్ చేసుకుని మరీ దూసుకుపోయేందుకు సిద్ధమయ్యారు మెగా ఫ్యాన్స్. 'ఈసారి మన టార్గెట్ లక్షకు పైగా ట్వీట్స్' అంటూ లక్ష్యాన్ని పంచుకుంటున్నారు. పైగా ఇప్పటికే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ కూడా మొదలైపోయింది. #Chiru150.. #Chiru150FirstLook.. అనే హ్యాష్ ట్యాగులకు.. చిరు బర్త్ డే కౌంట్ డౌన్ సెట్ చేసి మరీ షేర్ చేసుకుంటున్నారు. గతేడాది చిరు 60వ పుట్టిన రోజు సందర్భంగా మెగా వారోత్సవాలు జరిగాయి. ఇప్పుడు కూడా దానికి ఏ మాత్రం తగ్గకుండా మెగా ఫ్యాన్స్ ప్లాన్ చేశారు. ఆన్ లైన్ లో మాత్రం తామెందుకు తక్కువగా ఉంండాలనే ఉద్దేశ్యంతో.. ఈ ట్రెండింగ్ స్టార్ట్ చేసేశారు. లక్ష ట్వీట్స్ టార్గెట్ ని అందుకోవడం మెగా బర్త్ డే ట్యాగ్ కు పెద్ద కష్టమేం కాదనే టాక్ వినిపిస్తోంది.

Related Top Stories