ఆ పిల�ల పవన� కూత�రేనా

<< Back


రాఖీ పండగ పూర్తయిన రెండు రోజుల తరువాత.. తనకు రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్ళ ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు రామ్ చరణ్. అయితే ఈ ఫోటోలను చూడగానే మనకు కొన్ని కొత్త విషయాలు తెలియక మానవు. ముందుగా ఈ ఫోటోల్లో కనిపిస్తున్న చరణ్ తోబుట్టువులు.. శ్రీజ అండ్ సుస్మిత.. ఈ ఫోటో ఇప్పటికాదని ఈజీగా చెప్పేయవచ్చు. ఎందుకంటే చరణ్ ప్రెజంట్ లుక్ అందులో కనిపించట్లేదు. ఇకపోతే నిహారిక.. అలాగే చరణ్ కజిన్స్.. వీరందరూ రాఖీ కడుతున్న ఫోటోలు మాత్రం కొత్తవే. అయితే ఇదే ఫోటోలో చీరకట్టుకున్న ఒక ఫారిన్ లేడీ.. తన పాపతో చరణ్ కు రాఖీ కట్టడం మనం చూడొచ్చు. కట్ చేస్తే ఇప్పుడు ఆ పిల్ల ఎవరో కాదు చరణ్ కు సిస్టర్ అంటే మరి పవన్ కళ్యాణ్ కూతురేగా అని వినిపిస్తోంది. పైగా చరణ్ ఏకంగా ఫేస్ బుక్ లో ఫోటోనే పోస్టు చేశాడంటే.. ఖచ్చితంగా పవన్ కూతురు కాకపోతే ఇంకెవ్వరు అవుతారు అనే క్లారిటీ మనకు వచ్చేస్తుంది కూడా. ఏదేమైనా కూడా.. మొన్న 61వ బర్త్ డే బ్యాష్ లో పవన్ భార్య అన్నా లెజినోవా వచ్చిందని.. ఇప్పుడు పవన్ చిన్న కూతురు చరణ్ కు రాఖీ కట్టిందని.. ఎటు చూసినా కూడా అంతా పవన్ ఫ్యామిలీ గురించి టాక్ వినిపిస్తోందబ్బా!!

Related Top Stories