‘బాహ�బలి’ తర�వాత గ�యారేజే

<< Back


ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యంత హైప్ మధ్య విడుదలకాబోతోంది ‘జనతా గ్యారేజ్’. ఆ అడ్వాంటేజీని ఫుల్లుగా వాడేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు బిజినెస్ ఓ రేంజిలో జరిగింది. విడుదల కూడా భారీగానే ఉండబోతోంది. ప్రపంచవ్యాప్తంగా 2500 స్క్రీన్లలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అంచనా. తెలుగు.. మలయాళంతో పాటు తమిళంలో కూడా ఒకేసారి ఈ సినిమా రిలీజవుతుంది. ‘బాహుబలి తర్వాత అత్యధిక స్క్రీన్లలో రిలీజవ్వబోయే తెలుగు సినిమా ఇదే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోహన్ లాల్ ఉండటం వల్ల మలయాళం.. తమిళంలోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేసుకోవడానికి అవకాశం దక్కుతోంది. తెలుగులో సైతం ఎన్టీఆర్ కెరీర్లో గతంలో ఎన్నడూ లేనంత భారీగా ఈ చిత్రాన్నిరిలీజ్ చేయబోతున్నారు. తెలుగు వెర్షన్ మాత్రమే 1500కు పైగా స్క్రీన్లలో రిలీజవుతుంది. ఓవర్సీస్ లో సైతం ఎన్టీఆర్ ప్రతి చోటా ఎన్టీఆర్ కెరీర్ రికార్డు నెలకొల్పబోతున్నాడు. ఆల్రెడీ యూఏఈలో 42 స్క్రీన్లు కన్ఫమ్ అయ్యాయి. ఇది ఎన్టీఆర్ వరకే కాదు.. తెలుగు సినిమాలకే రికార్డు. ఇప్పటిదాకా ఏ తెలుగు సినిమా కూడా గల్ఫ్ దేశంలో అన్ని స్క్రీన్లలో రిలీజవ్వలేదు. అమెరికాలో ఈజీగా 200కు పైగా స్క్రీన్లు దక్కే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి ‘జనతా గ్యారేజ్’ మీద ఉన్న హైప్ కు తగ్గట్లు భారీ ఓపెనింగ్స్ రాబట్టడానికి సరైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Related Top Stories