మొహెంజదారో దెబ్బకు డిస్నీ ఔట్

<< Back


వాల్ట్ డిస్నీ.. సినీ ప్రియులకు దీని గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హాలీవుడ్లో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేసిన ఈ ప్రొడక్షన్ హౌజ్.. కొన్నేళ్ల కిందట ఇండియన్ సినిమాలోకి కూడా అడుగుపెట్టింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘యూటీవీ’తో కలిసి ఇండియాలో సినిమాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పీకే లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను పంపిణీ చేసింది ఆ సంస్థే. తాజాగా తమ సంస్థే నిర్మించిన ‘జంగిల్ బుక్’ ఇండియా వెర్షన్ ను భారీ స్థాయిలో రిలీజ్ చేసింది. భారతీయ సినీ చరిత్రలోనే ఏ హాలీవుడ్ మూవీ సాధించిన కలెక్షన్లతో పండగ చేసుకుంది. అలాంటి సంస్థ ఇప్పుడు ఉన్నట్లుండి ఇండియన్ సినిమాల ప్రొడక్షన్ నుంచి తప్పుకుంది. అందుకు ఒక రకంగా ‘మొహెంజదారో’ సినిమానే కారణం. యూటీవీ భాగస్వామ్యంలో భారీ మొత్తానికి ‘మొహెంజదారో’ హక్కులు కొని రిలీజ్ చేసిన డిస్నీకి చేదు అనుభవం ఎదురైంది. ఈ సినిమాపై చాలా డబ్బులు పోయాయి. ఈ ఏడాది ఆరంభంలో ‘ఫితూర్’ రూపంలో మరో దెబ్బ కూడా తగిలింది. ఓవరాల్ గా చూసుకుంటే హిట్లతో వచ్చిన లాభాల కంటే ఫ్లాపులతో వచ్చిన నష్టాలే ఎక్కువైపోతుండటం.. టర్నోవర్ తమ సంస్థ స్థాయికి తగ్గట్లుగా లేకపోవడంతో ఇంత పెద్ద సెటప్ ఇండియాలో అవసరం లేదనే నిర్ణయానికి వచ్చింది డిస్నీ. ఇండియన్ సినిమాలో సక్సెస్ రేట్ తక్కువని భావించి.. ఇక్కడ ప్రొడక్షన్ ఆపేయాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది జనవరి వరకు డిస్నీ వాళ్లకు.. యూటీవీకి ఒప్పందం ఉంది. అది ముగియగానే ఇండియన్ సినిమాకు టాటా చెప్పేయనుంది డిస్నీ.

Related Top Stories