ద�మ�మ�ద�లిపేస�త�న�న జనతా గ�యారేజ�

<< Back


‘జనతా గ్యారేజ్’ విడుదలకు ఇంకా వారం రోజులే ఉంది. ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే తారా స్థాయికి చేరిపోయాయి. ఇప్పటిదాకా ఎన్టీఆర్ సహా ఎవరూ నేరుగా ప్రమోషన్ కోసం రంగంలోకి దిగలేదు. ఈ లోపు కేవలం పోస్టర్లతోనే పిచ్చెక్కించేస్తోంది గ్యారేజ్ టీమ్. కొన్ని రోజులుగా రోజుకు కనీసం రెండు మూడు పోస్టర్లు రిలీజ్ చేస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని అంతకంతకూ పెంచేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్-సమంతల డ్యాన్స్ నంబర్ కు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్ అదుర్స్ అనిపిస్తోంది. సమంత బాబీ గర్ల్ లాగా పోజు ఇస్తుంటే.. ఎన్టీఆర్ వెనక్కి వంగి ఓ స్టెప్ ట్రై చేస్తున్నాడు. ఇది చూస్తుంటే సినిమాలో తారక్ డ్యాన్సులు ఇరగదీశాడడని ఇప్పటికే ఉన్న అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. మరోవైపు ఎన్టీఆర్-మోహన్ లాల్ కాంబినేషన్లో వదిలిన పోస్టర్లు సైతం ఇంతే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. హీరోయిన్లతోనే కాక.. లాల్ తోనూ కెమిస్ట్రీ బాగానే పండించాడు ఎన్టీఆర్. ఒకట్రెండు రోజుల్లోనే ‘జనతా గ్యారేజ్’ డైరెక్ట్ ప్రమోషన్ మొదలవుతుంది. ఎన్టీఆర్.. కొరటాల.. సమంత మీడియాను కలిసి ఇంటర్వ్యూలివ్వబోతున్నారు. మోహన్ లాల్ ను కూడా రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీవీ షోల ద్వారా కూడా ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మలయాళంలో కూడా సినిమాను భారీ ఎత్తున ప్రమోట్ చేసి డైరెక్ట్ సినిమా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.

Related Top Stories