పవన్ కళ్యాణ్ కోసం అల్లు అర్జున్

<< Back


పవన్ కళ్యాణ్ అభిమానులకు.. అల్లు అర్జున్ కు అనుకోకుండా అంతరం వచ్చేసింది. గత కొన్ని నెలల్లో రకరకాల పరిణామాలు జరిగాయి. పరిస్థితి చాలా సెన్సిటివ్ గా తయారైంది. ఈ మధ్య ‘ఒక మనసు’ ఆడియో వేడుకలో పవన్ అభిమానులకు సర్దిచెప్పినా పరిస్థితిలో పెద్దగా మార్పు వచ్చినట్లుగా కనిపించలేదు. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పాడు బన్నీ. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన బన్నీ.. చివర్లో ‘పవర్’.. ‘స్టార్’ సింబల్స్ పెట్టి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మరోవైపు బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ కూడా పవన్ కు డీటైల్డ్ గా విష్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు సినీ ప్రముఖులు చాలామంది పవన్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. డైరెక్టర్ బాబీ తనకు తెలిసిన అత్యంత దేశభక్తి.. అత్యంత దయగల వ్యక్తి పవన్ అని.. నిజమైన నాయకుడని పొగిడేస్తూ పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు. పవన్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్.. వివిధ సందర్భాల్లో పవన్ తన దయాగుణం చాటుకున్న ఫొటోలన్నీ మిక్స్ చేసి పెట్టి బర్త్ డే విష్ చెప్పాడు. మరోవైపు సమంత.. పవన్ చాలా తక్కువ మాట్లాడతాడని.. కానీ ఆ మాటలు చాలా ఇంపాక్ట్ చూపిస్తాయని చెబుతూ విషెస్ చెప్పింది. ‘‘తెలుగు సినిమా పవర్ హౌస్ పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు’’ అని వరుణ్ తేజ్ అన్నాడు. తాను తెలుగు పరిశ్రమలో తొలి పారితోషకం అందుకున్నది పవన్ నుంచే అని.. జానీ లోగోను డిజైన్ చేసింది తనేనని అంటూ మారుతి విషెస్ పెట్టాడు. ఇంకా చాలామంది ప్రముఖులు పవన్ ను విష్ చేశారు.

Related Top Stories