ఈ యాంకర్ విషెస్ తో ఫ్యాన్స్ షాక్

<< Back


మొత్తానికి అనుకున్నట్లే షాకిచ్చేసింది యాంకర్ అనసూయ. ఆ మధ్యన జబర్ దస్త్ ప్రోగ్రామ్ ను వదిలేసి.. కేవలం ఇతర టివి షోలతో అలాగే సినిమాలతో కాలక్షేపం చేసిన అనసూయ.. అప్పట్లో 'అత్తారింటికి దారేది' సినిమాలో ఐటెం సాంగ్ అందుకే చేయలేదు అంటూ ట్వీటు వేయడంతో నానా రచ్చ అయిపోయింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నానా బీభత్సం సృష్టించేశారు. కట్ చేస్తే.. తరువాత అనసూయ అనేక ట్రాలింగ్స్ లో భాగం అయిపోయింది. ఆ ఎపిసోడ్ ముగిశాక.. అనసూయకు కూడా సినిమాల్లో ఛాన్సులొచ్చినా కూడా అవి పెద్దగా క్లిక్కవ్వక.. ఇప్పుడు మరోసారి బబర్ దస్త్ కు యాంకరింగ్ కు వెళిపోయి అమ్మడు బిజీ అయిపోయింది. అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా.. ''ఈ కాలానికి చెందిని చాలా ప్రభావితం చేసే వ్యక్తి.. పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు. మోర్ పవర్ టూ యు పవర్ స్టార్'' అంటూ అమ్మడు సోషల్ నెట్వర్కులో పేర్కొంది. ట్వీటేసిన క్షణాల్లో పవన్ ఫ్యాన్స్ అందరూ ఈ ట్వీట్ చూసి షాకైపోయారట. సర్లేండి.. పవన్ కళ్యాణ్ కు విషెస్ చెప్పని స్టార్ అండ్ ఫ్యాన్ ఎవరైనా ఉంటారా? అందుకే ఆయన పవర్ స్టార్. పోతే గతరాత్రి అనసూయ తన తెల్లటి చీరకట్టు.. డీప్ నెక్ బ్లౌజ్ లుక్కుతో.. జబర్ దస్త్ లో చంపేసిందంతే.

Related Top Stories