పవన� మీద రోజా రివర�స� అటాక�

<< Back


మొన్న తిరుపతి సభలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజానుద్దేశించి పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తనను రబ్బర్ సింగ్ అని రోజా అన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. నోరుజారితే సస్పెండయి ఇంట్లో కూర్చోవాల్సి వస్తుందంటూ రోజా మీద సెటైర్ వేశాడు పవన్. ఈ వ్యాఖ్యలపై రోజా స్పందిస్తూ.. పవన్ మీద రివర్స్ అటాక్ చేసింది. షూటింగ్ లేనపుడు మాత్రమే పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక హోదా గుర్తుకొస్తుందని.. దాని కోసం పోరాటం అంటూ బయటకు వస్తాడని రోజా విమర్శించింది. ఖాళీ సమయాల్లో పోరాటం చేసే వారు నాయకులు కాలేరని పవన్ ను ఉద్దేశించి రోజా పేర్కొంది. పవన్ కళ్యాణ్ కాకినాడ సభను ప్రభుత్వమే స్పాన్సర్ చేస్తోందని ఆమె ఆరోపించింది. చారు. తాను ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని.. పవన్ కళ్యాణ్ మాదిరి భజన చేయనని ఆమె అన్నారు. అదికారంలో ఉన్న పార్టీ నుంచి ప్యాకేజీ తీసుకోలేదనే తనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని.. ఈ విషయంలో తాను గర్వపడుతున్నానని రోజా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి కూడా రోజా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అదికారంలోకి వచ్చినప్పుడల్లా కరవు వస్తుందని.. చంద్రబాబు-కరవు కవల పిల్లలని రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమయయారన్నారు. ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తే కమీషన్లు కొట్టేయొచ్చని టీడీపీ నేతలు ఆలోచిస్తున్నారని ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు తన స్వార్థం కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని విమర్శించారు.

Related Top Stories