చిర�-నాగ�-సచిన� ల�ంగీ ల�క�

<< Back


సినిమా రంగానికి చెందిన ప్రముఖులు స్పోర్ట్స్ ఫ్రాంచైజీల్లో పెట్టుబడులు పెట్టడం ఐపీఎల్ నుంచి బాగానే ఊపందుకుంది. ఆ తర్వతా ప్రొకబడ్డి లీగ్ తో చాలామంది రంగంలోకి దిగిపోయారు. తాము మాత్రం ఏం తక్కువ అనుకున్న మన టాలీవుడ్ జనాలు.. ఇండియన్ సూపర్ లీగ్ పేరుతో జరిగే ఐఎస్ ఎల్ లో వాటాలు కొనేసిన సంగతి తెలిసిందే. కేరళ బ్లాస్టర్స్ జట్టుకు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తో పాటు.. మెగాస్టార్ చిరంజీవి.. నాగార్జున.. నిమ్మగడ్డ.. అల్లు అరవింద్ లు కూడా సహ యజమానులు. ఇప్పుడీ కేరళ బ్లాస్టర్స్ ఫుట్ బాల్ క్లబ్.. మూడో సీజన్ కు రెడీ అయిపోతున్న సందర్భంగా.. టీమ్ ను అనౌన్స్ చేసేందుకు అందరూ ప్లేయర్లతో పాటు యజమానులు కూడా ఒక చోటకు చేరారు. సచిన్ తో పాటు చిరంజీవి.. నాగార్జున.. అల్లు.. నిమ్మగడ్డలు తెల్ల లుంగీలు.. పసుపు రంగు టీషర్టుల్లో కొత్త లుక్ తో కనిపించారు. ఈ టీమ్ కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరో తెలుసా.. హీరో నివిన్ పౌలీ. అదేనండీ.. చైతు ప్రేమమ్ ని రీమేక్ చేస్తున్నాడు కదా. ఒరిజినల్ ప్రేమమ్ లో హీరో ఈ కుర్రాడు. మన టాలీవుడ్ ప్రతినిధులంతా కాస్త సైలెంట్ గానే ఉన్నారు కానీ.. అసలే ఆటగాడు.. అందులోనూ ఫుట్ బాల్ పై ఎనలేని మక్కువ ఉన్న సచిన్ మాత్రం ఈ టీమ్ అనౌన్స్ మెంట్ ఈవెంట్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. కానీ టాలీవుడ్ కి మాత్రం మన టాలీవుడ్ జనాల లుంగీ లుక్ డిఫరెంట్ గా భలే నచ్చేసింది.

Related Top Stories