నేను బాహుబలి కొన్నానా? హాహాహా

<< Back


అవును. సరిగ్గా కింగ్ నాగార్జున ఎక్స్ ప్రెషన్ అదే. ఆయన అచ్చం అలాంటి హావభావాలే చూపించారు. నిజానికి ఒక్కోసారి అసలు ఈ రూమర్లు ఎలా పుడతాయో పుట్టిస్తారో అంటూ అందరూ ఆశ్చర్యపోవాల్సిందే అంటూ ఛమత్కరించారు కూడా. మ్యాటర్ ఏంటంటే.. కింగ్ నాగార్జున ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటితో కలసి బాహుబలి 2 సినిమా గుంటూరు జిల్లా రైట్స్ కొన్నారంటూ రెండు రోజుల క్రితం హడావుడి మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ రూమర్లలో నిజం ఉందా లేదా అనేదే వెరిఫై చేయకుండా కొన్ని ప్రముఖ వార్తాపత్రికలు కూడా ఆ న్యూస్ వేయడంతో అందరూ నిజమనే అనుకున్నారు. కాని ఇదే విషయం 'నిర్మలా కాన్వెంట్' సినిమా ప్రమోషన్స్ టైములో నాగ్ ను అడిగితే.. ''హా హా హా.. నేను బాహుబలి కొనడం ఏంటి? అసలు ఈ రూమర్లు ఎవరు పుట్టిస్తారు?'' అంటూ గాట్టిగా నవ్వేశారు. అసలు తనకు అలాంటి డిస్ర్టిబ్యూషన్ ఐడియాలు ఏవీ లేవని కూడా తేల్చిచెప్పేశారు. ప్రస్తుతం ఒక ప్రక్కన దాదాపు షూటింగ్ పూర్తయిన తన 'ఓం నమో వెంకటేశాయా' సినిమా విజువల్ ఎఫెక్ట్స్ వర్కు జరుగుతోందట. అవి పూర్తయ్యాక రిలీజ్ డేట్ చెబుతారట. ఇకపోతే మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ లో తన స్థానంలో మెగాస్టార్ చిరంజీవి రావడం ఆనందంగా ఉందని.. తానే బ్రేక్ తీసుకున్నానని.. ఇప్పుడు చిరంజీవి రాకతో ఈ ప్రోగ్రామ్ రేంజ్ మరింత పెరుగుతుందని వ్యాఖ్యానించారు.

Related Top Stories